గుండె వేగం 250 నుంచి 72కు..

- మహిళా రైతుకు అరుదైన గుండెచికిత్స
- ఒకే ఆపరేషన్‌తో రెండు చికిత్సలు
- నిమ్స్ వైద్యుల ఘనత
.ఖైరతాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళా రైతుకు నిమ్స్‌లో అరుదైన ఆపరేషన్ చేసి గుండె సమస్య నుంచి విముక్తి కల్పించారు. కామారెడ్డికి చెందిన బాలమణి(56)కి ఇటీవల ఆయాసం, గుండెదడ అధికమయ్యాయి. స్థానికంగా పలు దవాఖానలలో చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో ఈ నెల మొదటివారంలో నిమ్స్‌లో చేరింది. అక్కడ జరిపిన పరీక్షల్లో గుండె కవాటం ఒకటి మూసుకుపోవడం, గుండెలోపం వల్ల నాడి ఎక్కువ వేగంతో కొట్టుకోవడం అనే జంట సమస్యతో ఆమె బాధ పడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిసతీశ్ బృందం ఆమెకు బెలూన్ వాల్వోటమి చేసి కవాటంలోని అడ్డంకిని తొలగించింది. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో గుండె కొట్టుకునే వేగాన్ని 250 నుంచి 72కు తగ్గించారు. దాంతో రెండు సమస్యలూ తొలగిపోయాయి. ఇలా ఒకేసారి ఆపరేషన్ చేసి రెండు సమస్యలు పరిష్కరించడం అరుదని అంటున్నారు. ఓపెన్ హార్ట్ చికిత్స అవసరం లేకుండా కేవలం చిన్న కాటు, క్యాథటర్ల సాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకొన్నారని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్ సాయిసతీశ్ తెలిపారు. లక్షలాది రూపాయలు విలువ చేసే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో ఉచితంగా నిర్వహించామని వివరించారు. డాక్టర్ సాయిసతీశ్ బృందానికి బాలమణి కృతజ్ఞతలు చెప్పారు. ‘దేవుడిలా నన్ను కాపాడారు. నా కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

