హైదరాబాద్ : తౌటే తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. రాష్ర్టంలో రాగల మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజు ఒకట్రెండు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. తౌటే తుపాను ప్రభావం రాష్ర్టానికి అంతగా లేకపోయినప్పటికీ దక్షిణ దిశగా వీస్తున్న బలమైన గాలుల కారణంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.