హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో పవన్‌కల్యాణ్ వివాదంపై ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్‌కు గణేశ్ గురువారం స్పందించారు. ‘మీరొస్తానంటే మేమొద్దంటామా? ఉత్తిత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? అంటూ పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్‌రాజ్ పోస్టు చేశారు. దీనికి ప్రతిసగా బండ్ల గణేశ్ తీవ్రమైన పదజాలంతో ప్రతిస్పందించారు.
‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవరు? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా? లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పనిలేకపోతే చూసుకో! కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ చిరునామా తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!’ అంటూ ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గణేశ్ ఘాటుగా బదులిచ్చారు.