హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ఓ మంత్రి కుమారుడి రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. పెండ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు ఆ యువతి గర్భవతి అని ప్రచారం జరుగుతున్నది.
దీంతో గత్యంతరం లేక తాము సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను బయటపెడతానని ఆ యువతి బెదిరిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. దీంతో సదరు మంత్రి కుటుంబం ఆ యువతితో సంప్రదింపులు జరుపుతున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశం సోషల్మీడియాతోపాటు కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిందని సమాచారం. ఆ మంత్రి ఎవరు? ఏమిటా కథ! అంటూ చర్చించుకుంటున్నారు.