Errabelli Dayakar Rao | సాగు నీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి కాలువ బాట.. అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం
Errabelli Dayakar Rao | జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు.
Errabelli Dayakar Rao | జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దేవరుప్పుల, కొడకండ్ల మండలకు సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కి తరలించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామన్నారు. ఎర్రబెల్లిని భేషరతుగా విడుదల చేయాలని ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా తోపులాటలో ఎర్రబెల్లికి నుదుటికి స్వల్పంగా గాయం కావడంతో పోలీసులు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

