ప్రజలకు విజ్ఞప్తి.. ప్రయాణాలు వద్దు : మంత్రి ఈటల
ప్రయాణాలు వద్దు | కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్ : కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.
ఇక మహారాష్ర్టకు అనుకొని ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఏ ఆపదొచ్చినా తెలంగాణ ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ఎవరూ భయాందోళనకు గురికావొద్దని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

