OU | నిరుద్యోగులు ఆగ్రహం.. ఓయూలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులు దహనం
OU | ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
OU | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో రూ.4000 నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయకుంటే దాడులు చేస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు.
నిన్న శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల్లో ఎక్కడా హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ నిరుద్యోగ భృతి గురించి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించారని, ప్రియాంక గాంధీ కూడా ఓ సభలో వ్యాఖ్యానించారని నిరుద్యోగులు గుర్తు చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

