Osmania University | సైకాలజీ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు.. బీబీఏ పరీక్షా తేదీల మార్పు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ సైకాలజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహబిలిటేషన్ సైకాలజీ కోర్సుల మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్, పీఎస్వైడీ క్లినికల్ సైకాలజీ మొదటి సంవత్సరం రెగ్యులర్, ప్రొఫెషనల్ డిప్లమా ఇన్ క్లినికల్ సైకాలజీ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
బీబీఏ పరీక్షా తేదీల మార్పు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీబీఏ పరీక్షా తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీబీఏ (రెగ్యులర్) ఐదో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించినట్లు గతంలో ప్రకటించామని గుర్తు చేశారు. పరీక్షలను అదే తేదీ నుంచి ప్రారంభిస్తున్నప్పటికీ, పరీక్షలు నిర్వహించే ఇతర తేదీలను మార్చినట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నవంబర్‌లో జరిగిన బీఈడీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

