Telangana | మన చేనేత ఆవిష్కర్తకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పోటీల్లో హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ యంత్రానికి మొదటి స్థానం
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్తకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన ‘హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మెషీన్' ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ నిర్వహించిన ‘ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్' పోటీల్లో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికయ్యింది.
- హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ యంత్రానికి మోదా శివకుమార్ రూపకల్పన
- ఐఐఎం అహ్మదాబాద్ పోటీల్లో తెలంగాణ ఆవిష్కరణకు మొదటి స్థానం
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్తకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన ‘హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మెషీన్’ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ నిర్వహించిన ‘ఇన్నోవేషన్ ప్లే గ్రౌండ్’ పోటీల్లో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికయ్యింది. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ అగ్మెంటేషన్ నెట్వర్క్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆవిష్కర్తలు తమ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. మొదటి స్థానాన్ని పొందిన ఆవిష్కరణకు 50 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా విజేత మోదా శివకుమార్ మాట్లాడుతూ హ్యాండ్లూమ్ లిప్టింగ్ వీవింగ్ యంత్రాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఎంతో కీలకంగా వ్యవహరించిందని చెప్పారు.
తెలంగాణకు గర్వకారణం
తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో చాలా మంది గ్రామీణులు సరికొత్త ఆవిష్కరణలను చేసేందుకు ముందుకు వస్తున్నారు. నేత వృత్తిలో కార్మికులు ఎదుర్కొనే సమస్యకు శివకుమార్ ఆవిష్కరణ ఒక చక్కని పరిష్కారం. హ్యాండ్లూమ్ లిప్టింగ్ వీవింగ్ మెషీన్ వినియోగంలోకి వస్తే సంప్రదాయ చేనేత పరిశ్రమల్లో మార్పు వస్తుంది. ఈ ఆవిష్కరణతో శివకుమార్ ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు.
-శాంత తౌటం (సీఐవో, టీఎస్ఐసీ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

