స్పీక్ అప్ ఇండియా!
‘ఈ రోజు బిల్కిస్ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని గుర్తుంచుకోండి. స్పీక్ అప్ ఇండియా (భారతదేశమా గళం విప్పు)’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. బిల్కిస్‌బానో గ్యాంగ్‌రేప్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. జైలునుంచి వచ్చినవారిని విశ్వహిందూ పరిషత్ పూలమాలలతో సత్కరించిన ఫొటోలు
- నేడు బిల్కిస్ బానోకు జరిగింది.. రేపు మనలో ఎవరికైనా జరగొచ్చు
- దేశమా గళం విప్పు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘ఈ రోజు బిల్కిస్ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని గుర్తుంచుకోండి. స్పీక్ అప్ ఇండియా (భారతదేశమా గళం విప్పు)’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. బిల్కిస్‌బానో గ్యాంగ్‌రేప్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. జైలునుంచి వచ్చినవారిని విశ్వహిందూ పరిషత్ పూలమాలలతో సత్కరించిన ఫొటోలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఇది మన దేశ మనస్సాక్షికి మచ్చ. రేపిస్టులకు పూలమాలలు వేసి యుద్ధ వీరులుగా.. స్వాతంత్య్ర సమరయోధులుగా పరిగణిస్తున్నారు.
ఈ రోజు బిల్కిస్ బానోకు జరిగింది రేపు మనలో ఎవరికైనా జరగవచ్చని గుర్తుంచుకోండి. స్పీక్ అప్ ఇండియా(భారతదేశమా గళం విప్పు)’ అని ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపుపై నెటిజన్లు స్పందించారు. ‘బిల్కిస్ బానోకు మద్దతుగా దేశం మొత్తం పోరాడాలని.. జరిగిన అన్యాయానికి బీజేపీ, మోదీ బహరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేపిస్టులపై కనికరం చూపొద్దని, వారిని తిరిగి జైలుకు పంపాలని ట్వీట్లు చేశారు. ‘రేపిస్టులు త్వరలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ చర్యను వ్యతరేకించకపోతే బీజేపీ ఆగడాలను ఇకపై కూడా అడ్డుకోలేం’ అని కొందరు. ‘వీహెచ్‌పీ, ఆర్ఎస్సెస్‌లకు ఇది సిగ్గుచేటు..’ అని మరి కొందరు ట్వీట్లు చేశారు.
మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేం: స్మితా సబర్వాల్
బిల్కిస్ బానో కేసుపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తీవ్రంగా స్పందించారు. ‘ఒక మహిళగా, సివిల్ సర్వెంట్‌గా బిల్కిస్ బానో కేసు వార్తలను నేను నమ్మలేకపోయాను. భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న బిల్కిస్ బానో హక్కులను తుడిచిపెట్టి, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా పిలుచుకోలేం’ అని ఆమె ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bilkis banu
- culprits
- Nation
- Release
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

