Minister Jagadish Reddy | సమాజానికి నాయీ బ్రాహ్మణులు చేస్తున్న సేవలు మరువలేనివి : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | సమాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా, మంగళ వాయిద్య కళాకారులుగా, క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయీ బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి,మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy )అన్నారు.
సూర్యాపేట : సమాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా, మంగళ వాయిద్య కళాకారులుగా, క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయీ బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి,మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy )అన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నాయీ బ్రాహ్మణులు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రికి రాబోయే ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులు ఏకగ్రీవంగా తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆధునిక వైద్యం, సాంకేతికత అందుబాటులోలేని రోజుల్లో అనేక మొండి వ్యాధులకు చికిత్సలు అందించి, గర్భిణులకు పురుడు పోసి, మంగళ వాయిద్యాలతో సైతం రోగ నివారణ చేసిన తొలితరం వైద్యులు నాయీ బ్రాహ్మణులేనని తెలిపారు. 2014 ముందు వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు.
సెలూన్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తు, బీసీ బంధు పథకంలో ఒక లక్ష ఆర్థిక చేయూతనందించినది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. నిరుపేద నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

