హైదరాబాద్, మార్చి 30 : సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ 2021 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ తెలిపారు. అభ్యర్థులకు మహేశ్ భగవత్, ఏకే ఖాన్, వీసీ సజ్జనార్, ఆర్ గోపాలకృష్ణ వంటి ప్రముఖులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గల వారు kptrainer@gmail.com, 91332 37733, 91336 37733 నంబర్లను సంప్రదించాలని సూచించారు.