ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను తెలంగాణ సమాజం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కవితను విడుదల చేయకపోతే ఆమరణదీక్ష చేపడతానని హెచ్చరించారు.