Saichand wife | సాయిచంద్ సతీమణి వేద రజనీకి గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రం అందజేత
Saichand wife | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజనిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ నివాసానికి వెళ్లిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రాన్ని వేద రజనికి అందజేశారు.
Saichand wife | హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజనిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ నివాసానికి వెళ్లిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రాన్ని వేద రజనికి అందజేశారు. ఈ సందర్భంగా సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిచంద్ భార్య రజనికే ఆ బాధ్యతలను అప్పజెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ భార్య రజనిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
సాయిచంద్ 1984, సెప్టెంబరు 20న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, అమరచింత గ్రామంలో వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అమరచింతలో పదో తరగతి, ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. సాయిచంద్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.

Saichandwife Ware1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

