బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష
MJPTBCW Entrance test: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్ధులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొవిడ్ నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలని మల్లయ్య భట్టు సూచించారు. ఈ ప్రవేశపరీక్ష ద్వారా రాష్ట్రంలోని జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలల్లో, మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తే 040-23326266 నెంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

