Ponguleti Srinivas Reddy | నేనే నంబర్ 2.. ముఖ్యమంత్రి తర్వాత నేనే: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉపముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రికానీ, సీనియర్ మంత్రి కానీ రేస్‌లో ఉంటారు. ప్రస్తుతం ఉప ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు.
- క్యాబినెట్లో బలమైన శాఖ నాదే
- సభా వేదికలపై చెప్పుకొంటున్న
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉపముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రికానీ, సీనియర్ మంత్రి కానీ రేస్‌లో ఉంటారు. ప్రస్తుతం ఉప ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరికి ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నది. కానీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలో తానే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ మంత్రిని అని చెప్పుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన తీరుపై ఇతర మంత్రులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి తానే అంతా అన్నట్టుగా వ్యవహరిస్తుండటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారి మంత్రి అయినవాళ్లే తనది ముఖ్యమైన శాఖ అని, ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఉండే శాఖ అని చెప్పుకోవడం ఏమిటని అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం మీ దయతో ఉన్నది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో మీ అందరి దీవెనలతో రెవెన్యూమంత్రిగా నేను ఉన్నాను. నా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒక మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాను’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో భట్టి ఉపముఖ్యమంత్రిగా, తుమ్మల వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, పొంగులేటి మాత్రం ఖమ్మం జిల్లాలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్గంలో తానే నెంబర్ 2 అని చెప్పుకోవడం వివాదస్పదమవుతున్నది. బహిరంగసభల్లో కూడా ఇలాగే చెప్తుండటంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని జిల్లాలో పలువురు ప్యారాచూట్ నేతలు ఉన్నారని, వారికి మంత్రి పదవులు చాలునని వ్యాఖ్యానించారు. ఆమె పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాట్లాడారని పార్టీ కోడైకూస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

