మునుగోడు విజయం.. సీఎం కేసీఆర్‌పై ప్రజల విశ్వాసానికి నిదర్శనం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Minister Indrakaran Reddy |
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంపై అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు. ఎవరు ఎన్ని క్రుటుల, కుయుక్తులు పన్నినా ఎప్పటికీ ధర్మం గెలుస్తుందని మునుగోడు ప్రజలు నిరూపించారని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ దేశవ్యాప్త జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాందికానుందన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించనుందని, ఈ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలవనుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని, తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి స్పష్టమైందన్నారు. ఈ తీర్పుతో చైతన్యవంతులైన ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి నల్లొండ జిల్లా ప్రజల విజ్ఞత మరోసారి రుజువైందని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

