‘మను’ ప్రవేశాలు ప్రారంభం

హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) రెగ్యులర్ మోడ్ పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల కోసం ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాన క్యాంపస్ హైదరాబాద్‌తో పాటు లక్నో, శ్రీనగర్ క్యాంపస్‌లలో ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను స్కూల్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎడ్యూకేషన్, ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్, టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ లో 23 పీహెచ్డీ, 21 పీజీ, 8 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో మను ప్రవేశాలను అందిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 12 కాగా, మెరిట్ ఆధారిత కోర్సుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 4 వరకు సమర్పించవచ్చు. అదేవిధంగా పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15. కోర్సుల బోధన, పరీక్ష ఉర్దూలో మాత్రమే ఉంటుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
ఆన్లైన్ అప్లికేషన్, ఇ-ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం, https://manuu.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించింది. ఏదైనా సమాచారం కోసం admissionsregular@manuu.edu.in కు ఇ-మెయిల్ చేయొచ్చంది. సాధారణ ప్రశ్నలకు అడ్మిషన్ హెల్ప్‌డెస్క్‌ను నంబర్లు 9523558551, 9866802414, 6302738370 & 9849847434 లను సంప్రదించవచ్చిన పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

