సిటీ మెట్రోకు నై.. నోయిడా మెట్రోకు సై
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకొన్న ఎల్ అండ్ టీ సంస్థ అనతికాలంలోనే నోయిడాలో మెట్రో ప్రాజెక్టును దక్కించుకున్నది.
- మెట్రోను వదులుకున్న ఎల్ అండ్ టీ
- ఏడాదిలోనే మరోచోట రెండో ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్
- సర్కార్ తీరుతో సిటీ మెట్రోకు తిప్పలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకొన్న ఎల్ అండ్ టీ సంస్థ అనతికాలంలోనే నోయిడాలో మెట్రో ప్రాజెక్టును దక్కించుకున్నది. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వ తీరుతోనే ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్ ప్రాజెక్టును వదులుకున్నదన్న విమర్శలకు మరింత బలం చేకూరుతున్నది. రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడంతోనే మెట్రో విస్తరణ పెట్టిన పంచాయితీ.. ఓ దిగ్గజ సంస్థ నగరాన్ని విడిచి పెట్టే పరిస్థితికి దారితీసింది. దీని ప్రభావం ఏకంగా నగరంలో మెట్రో విస్తరణపై పడింది.
ప్రభుత్వ తీరుతో విసిగిన ఎల్ అండ్ టీ సంస్థ ఆర్థిక భారం పేరిట హైదరాబాద్ మెట్రో వదులుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను శరవేగంగా దక్కించుకుంటున్నది. గతంలో ముంబై, ఆగ్రా, కొచ్చిన్ వంటి నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను సొంతం చేసుకున్న సంస్థ.. తాజాగా నోయిడాలో ఏ కంగా రూ. 2వేల కోట్ల విలువైన 15 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించే బాధ్యతలను దక్కించుకున్నది. హైదరాబాద్‌లో మాత్రం మెట్రో నిర్వహణ చేయలేం, కొత్త ప్రాజెక్టులను విస్తరించలేమంటూ చేతులెత్తేసింది.
రేవంత్ సర్కార్ తీరుతో
హైదరాబాద్‌లో పదేండ్ల కిందట రూ.22 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన 69 కిలోమీటర్ల అతిపెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్టును నిర్వహించలేమంటూ ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణీత గడువు కంటే ముందే చేతులెత్తివేసింది. ఈ మెట్రోకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన వయబుల్ గ్యాప్ ఫండ్ బకాయిలు రాకపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే నిర్వహణ భారం పేరిట నగరం నుంచి తప్పుకొందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో మరో 15 ఏండ్ల గడువు కంటే ముందే.. 15వేల కోట్ల అప్పులను సర్కార్‌కు నెత్తిన పెట్టి వెళ్లిపోయింది. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రోపై విమర్శలు, ఆ నేపథ్యంలో వేధింపులకు గురిచేయడంతోనే సిటీ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకొన్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆలసత్వమే సిటీ మెట్రోకు శాపం
ఎప్పుడో మొదలు కావాల్సిన మెట్రో విస్తరణ ప్రాజెక్టు ప్రభుత్వ అలసత్వం కారణంగా నిలిచిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఓవైపు దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టుల విషయంలో ఆయా రాష్ర్టాలు ప్రత్యేక దృష్టి పెడితే.. ఇక్కడ మాత్రం వేల కోట్ల విలువ చేసే భూములపై అత్యాశతో కాంగ్రెస్ సర్కార్ చేసిన విధ్వంసం ఇప్పుడు నగరవాసుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
యూపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాలు తమ రాష్ర్టానికి మెట్రో ప్రాజెక్టులు వస్తే చాలన్న విధానంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ మాత్రం నిర్మాణ సంస్థ పారిపోయేలా చేసిందన్న చర్చ నడుస్తున్నది. రేవంత్ సర్కార్ అనుసరించిన మొండివైఖరి, అనుభవరాహిత్యపు పాలన విధానాలు మెట్రో పురోగతికి శాపంగా మారాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

