సెకండ్ ఫేజ్‌లో తెలంగాణ డిమాండ్లు చూద్దాం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ
గోదావరి-కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన నీటి డిమాండ్లను రెండో దశలో నెరవేరుస్తామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొదటి దశకు ఒప్పుకోవాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తేల్చిచెప్పింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీసీ లింక్ నీటి కేటాయింపులపై సర్దుకుపోవాలని సలహా ఇచ్చింది.
- తొలుత జీసీ లింక్ మొదటి దశకు ఒప్పుకోండి
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి (జీసీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన నీటి డిమాండ్లను రెండో దశలో నెరవేరుస్తామని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మొదటి దశకు ఒప్పుకోవాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తేల్చిచెప్పింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీసీ లింక్ నీటి కేటాయింపులపై సర్దుకుపోవాలని సలహా ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ లేఖ రాసింది. జీసీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన 6వ సంప్రదింపుల సమావేశాన్ని ఆగస్టులో హైదరాబాద్ వేదికగా ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ పలు వాదనలు వినిపించింది.
జీసీ లింక్‌లో మళ్లించే 148 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 50% వాటా (74 టీఎంసీలు) కేటాయించాలని, తెలంగాణ ప్రాజెక్టులపై పడే ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయించాలని, ఆపరేషన్ ప్రొటోకాల్‌పై స్టడీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ అంశాలపై తాజాగా ఎన్‌డబ్ల్యూడీఏ సమాధానమిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. నదీ జలాలు వృథాగా సముద్రంలో కలువకుండా నిరోధించి దేశ ఉత్పత్తిని, విద్యుత్తు అవసరాలను మెరుగుపరచడంలో భాగంగా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నామని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ తన వాటా కింద ఉపయోగించుకోని 148 టీఎంసీల జలాలనే మొదటి దశలో మళ్లిస్తామని, రెండో దశలో హిమాలయాల నుంచి మహానదికి, మహానది నుంచి గోదావరికి నీటిని తీసుకురావాల్సి ఉంటుందని వివరించింది. మొదటి దశలో నీటికేటాయింపులపై సర్దుకుపోవాలని, రెండవ దశలో జల డిమాండ్లను తప్పక నెరవేరుస్తామని, జీసీ లింక్‌కు అంగీకరించాలని తెలిపింది.
ఉద్దండాపూర్ నిర్వాసితులకు రూ.146 కోట్లు
- పరిహారం ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ నిర్వాసితుల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. పరిహారం మొత్తం చెల్లింపు విషయమై ఉద్దండాపూర్ నిర్వాసితులు గత కొన్నేండ్లుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు నిండిన యువతకు సైతం రూ.6 లక్షల చొప్పున చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అందుకు అదనంగా రూ.146 కోట్లు అవసరమవుతాయన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా 3 వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న రాహుల్ విజయ్ ‘అ’!
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
Health tips | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లో ఆ పార్టును అస్సలు తినొద్దు తెలుసా..?
Hardeep Singh Puri: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

