లెమన్.. మీసం మెలేసెన్!
వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముతున్నారు. మార్చి మొదట్లో రూ.50గా ఉన్న కిలో నిమ్మకాయల ధర
కిలో కాయలు రూ.300-400
విడిగా ఒక్కో కాయ రూ.10 పైనే
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వేసవి తీవ్రత పెరగడంతో మార్కెట్లో నిమ్మకాయ మీసం మెలేస్తున్నది. తగ్గేదేలే.. అంటూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నది. ప్రస్తుతం విడిగా ఒక్కో కాయ రూ.10 పలుకుతున్నది. శని, ఆదివారాల్లో అయితే రూ.12కి పైగానే అమ్ముతున్నారు. మార్చి మొదట్లో రూ.50గా ఉన్న కిలో నిమ్మకాయల ధర.. ఇప్పుడు ఏకంగా ఏడింతలైంది. నాణ్యమైన నిమ్మకాయలు హోల్‌సేల్‌లో మార్కెట్లో కిలో రూ.160 నుంచి రూ.180 ధరకు లభ్యమవుతున్నప్పటికీ.. రిటైల్‌గా రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. దేశంలో గత రెండు నెలల నుంచి నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిరుడు భారీ వర్షాలు కురవడం, తెగుళ్లు సోకడం, అధిక తేమ వల్ల పూత, కాయ రాకపోవడంతో ఈసారి నిమ్మ దిగుబడి పడిపోయిందని రైతులు చెప్తున్నారు.
షర్బత్ కరువయ్యే
ఎండా కాలంలో గరీబు నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో షర్బత్ తయారీకి ఎక్కువగా ఉపయోగించేది నిమ్మకాయలే. కానీ ప్రస్తుతం నిమ్మకాయ పేదోడి ఇంటికి రానంటున్నది. వీటి ధరలు భారీగా పెరగడంతో షర్బత్ లేక సామాన్యుల గొంతు ఎండుతున్నది. నిమ్మకాయల ధరలు యాపిల్ ధరను దాటేయడం, ఫలితంగా సోడా, లెమన్-టీ రేట్లు కూడా పెరగడంతో వినియోగదారులు షాకవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

