Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో వలస కూలీల ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గద్వాల జిల్లా ఇందువాసికి చెందిన ఒకరు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు.
Accident | జోగులాంబ గద్వాల జిల్లా ఇందువాసి గ్రామానికి చెందిన కూలీలు కర్ణాటకలో ప్రమాదానికి గురయ్యారు. ఉపాధి కోసం పత్తి ఏరేందుకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పొట్టకూటి కోసం వలస వెళ్లిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన కూలీలు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏసేపు (48) అక్కడికక్కడే మృతి చెందారు. నాగన్న (40) కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. మొత్తం 32 మంది గాయపడినట్లు సమాచారం.
ఇందువాసి గ్రామానికి చెందిన సుమారు 35 దళిత కుటుంబాలు ఉపాధి కోసం మూడు రోజుల క్రితం కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు పత్తి ఏరేందుకు వలస వెళ్లాయి. శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో కూలీలు ట్రాక్టర్‌పై పనులకు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. క్షతగాత్రులను బళ్లారి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
ఈ ప్రమాదంపై జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కురుమన్న స్పందించారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద దళిత కుటుంబాలు పొట్టకూటి కోసం వలస వెళ్లిన సమయంలో ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం తీవ్రంగా బాధించిందన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకునేలా కర్ణాటక ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. మృతుడి కుటుంబంతో పాటు గాయపడిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

