హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ పీ శ్యామ్కోశీ నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆయన స్థానంలో జస్టిస్ శ్యామ్కోశీ తాతాలిక సీజేగా బాధ్యతలు చేపట్టారు.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శ్యామ్కోశీ 1967 ఏప్రిల్ 30న జన్మించారు. 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకొని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2013లో ఛత్తీస్గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2016లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూలై 27న బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.