జేఎన్టీయూ-హెచ్, ఈపీటీఆర్ఐ మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్: పర్యావరణ రంగం, అనుబంధ విషయాల్లో విద్య, పరిశోధన, శిక్షణ, సహకార కార్యక్రమాన్ని సులభతరం చేసేందుకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్), పర్యావరణ పరిరక్షణ శిక్షణ అండ్ పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందంపై జేఎన్టీయూ-హెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహరెడ్డి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా సంతకాలు చేశారు.
ఒప్పందంలో భాగంగా వర్షపునీటి సంరక్షణ విధానం, పట్టణ నిర్వహణను అమలు చేయడంలో జేఎన్టీయూ-హెచ్, ఈపీటీఆర్ఐకి సాంకేతిక సహకారం అందిస్తుందని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరస్పర సహకారం, నీటి సంరక్షణ కార్యకలాపాలు, సమాచార మార్పిడి, బోధనా సామగ్రి, సాంకేతిక, శాస్త్రీయ ప్రచురణలు, అధ్యాపక సభ్యులు, పరిశోధకులకు ఉపన్యాసాలు, ఇంటర్న్షిప్ మొదలైనవి ఇవ్వడానికి పరస్పర అవకాశాలు ఈ ఒప్పందం ద్వారా చేకూరనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

