పీఆర్సీ నివేదికను తెప్పించండి: టీఎన్జీవో
ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన తెలంగాణ రెండో పీఆర్సీ కమిటీ నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కోరింది. దీపావళి పర్వదినంలోపు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ వర్తింపజేయాలని కోరింది.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన తెలంగాణ రెండో పీఆర్సీ కమిటీ నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కోరింది. దీపావళి పర్వదినంలోపు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ వర్తింపజేయాలని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎస్ సంజయ్‌జాజును మంగళవారం సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. జనాభాతో సంబం ధం లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో 13శాతం హెచ్ఆర్ఏను అమలు చేయాలని వారు కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రసూతి సెలవుల విషయంలో ఇద్దరు పిల్లల పరిమితిని తొలగించి ఏపీ తరహాలో ఉత్తర్వులు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి పొన్నంతో భేటీ
రవాణాశాఖ ఉద్యోగుల సమస్యలపైనా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో టీఎన్జీవో, గ్రూప్-1 అధికారుల సంఘం నేతలు చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు యూనియన్ నేతలు తెలిపారు. గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్జీవో అసోసియేటెడ్ అధ్యక్షలు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, నగరశాఖ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్, కొండల్‌రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

