Munugodu | మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో భారీగా చేరికలు
Former MLA Prabhakar Reddy |మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో మునుగోడు మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు.
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా మునుగోడు మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వర్కాల మధుకర్, గౌరవ అధ్యక్షుడు గంజి భిక్షమయ్య, చేనేత సహకార సంగం అధ్యక్షుడు సంగిశెట్టి పరమేశం, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుడు కొంగరి వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అలాగే మీ అన్న వెంకట్ రెడ్డి ఎంపీగా ఇప్పుడు ఉన్నాడు కదామునుగోడు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

