PPE kit | వాడి పడేసిన పీపీఈ కిట్లతో హైడ్రోజన్.. ఐఐసీటీ పరిశోధకుల నూతన టెక్నాలజీ
వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్స్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఐసీటీ పరిశోధకులు నూతన టెక్నాలజీ రూ పొందించారు.
PPE kit | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్స్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఐసీటీ పరిశోధకులు నూతన టెక్నాలజీ రూపొందించారు. పాలిమర్స్ డెవలప్మెంట్పై అ ధ్యయనం చేస్తు న్న వినీత్ అనియా బృందం పరిశోధన ఫలితాలను ‘హైడ్రోజన్ ప్రొడక్షన్ పొటెన్షియల్ ఫ్రం ప్లాస్టిక్ పైరోల్సిస్ ఆయిల్’ పేరుతో ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. వైద్య రంగంలో వినియోగించే మాస్కులు, ఫేస్ షీల్డ్ కవర్లు, గ్లౌజు లు, ఆపరేషన్ థియేటర్లలో వినియోగించే ఆఫ్రాన్(గౌను)లను వృథాగా పడేయకుండా ప్రాసెస్ చేయడం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన హైడ్రోజన్ ఉత్పత్తి చేసే వీలు ఉంటుందని పరిశోధకు లు పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి తర్వాత పీపీఈ కిట్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. వాడి పడేసిన పీపీఈ కిట్లను పునర్వియోగ ప్రక్రియ ద్వారా పైరోలిసిస్ ఆయిల్ తీసి, దీనిని మరికొన్ని పాలిమర్ చర్యల ద్వారా కమర్షియల్గానూ హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసే వి ధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తు తం అంతర్జాతీయంగా హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ స్థాయిలో శిలాజ ఇంధన వనరులపై ఆధారపడాల్సి వస్తున్నది. హైడ్రోజన్ ఉత్పత్తికి తాజాగా మూడెంచెల విధానాన్ని అభివృద్ధి చేయగా.. దీని ద్వారా అతి తక్కువ సమయంలో వాణిజ్యపరంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేయొచ్చని తేలింది.
130 మిలియన్ మెట్రిక్ టన్నుల డిమాండ్
క్లీన్ ఎనర్జీగా భావించే హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరుగుతున్నది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 115-130 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ అవసరం ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

