హైదరాబాద్ : శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ ( Shamshabad ORR ) పై ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిజ్ గేట్-16 వద్ద ఆగిఉన్న లారీనీ వెనుక నుంచి వచ్చిన టీఎస్ 23 ఎఫ్ 2298 అనే నంబర్ గల కారు ఢీకొట్టింది .
లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.