ఏఈఈ పరీక్షలు వాయిదా వేయలేం హైకోర్టు స్పష్టీకరణ
నవంబర్ 6, 7 తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ (సివిల్) పరీక్షలను ప్రస్తుత తరుణంలో వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): నవంబర్ 6, 7 తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ (సివిల్) పరీక్షలను ప్రస్తుత తరుణంలో వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఆ పరీక్షల నిర్వహణ వల్ల ఇబ్బందిపడే అభ్యర్థులు శుక్రవారం సాయంత్రంలోగా టీజీపీఎస్సీకి వినతి పత్రాలు సమర్పించాలని సూచించింది.
ఆ వినతులను పరిశీలించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. నవంబర్ 2 నుంచి 6 వరకు ఎస్ఎస్సీ జేఈ పరీక్షలు జరుగనున్నందున ఏఈఈ పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ యూ సతీశ్, మరో ఆరుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ కే శరత్ ఈ ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

