హైదరాబాద్, ఫిబ్రవరి 23( నమస్తే తెలంగాణ): అపార్ట్మెంట్ సెల్లార్ (స్టిల్ట్ ఫ్లోర్)లో వాచ్మెన్ నివాస గదితోపాటు రెండు మరుగుదొడ్లను నిర్మించుకోవచ్చునని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012 భవన నిబంధనల ప్రకారం ఆ నిర్మాణాలకు వీలున్నదని గుర్తు చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించేందుకు చట్టంలో వెసులుబాటు ఉన్నదని తెలిపింది. ఈ నిర్మాణాలకు విధిగా ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.