Heavy Rains | రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. మూసీకి పొంచి ఉన్న భారీ వరద ముప్పు
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతాయని తెలిపింది.
హైదరాబాద్: వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో ఇప్పటికే పొంగి పొర్లుతున్న మూసీకి.. మరింత వరద ముప్పు పొంచిఉన్నది. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిందిఏ. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

