హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కుంటిసాకులు చెప్తూ సంబంధం లేని కాగితాలు చూపించి డిప్యూటీ సీఎం భట్టి తప్పించుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల పేరిట రూ. 5,420 కోట్ల అదనపు భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మో పిందని హరీశ్‌రావు విమర్శించారు. పండుగ పూట ఈ భారాన్ని రద్దు చేయాల్సిందిపోయి, ప్రజల నుంచి ముకుపిండి వసూలు చేస్తామ ని అధికారులతో చెప్పించడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని తెలుపుతూ భట్టి మీడియా సమావేశంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎకడా కరెంట్ కోతలు లేవని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధమని హరీశ్‌రావు ఆరోపించారు. సరఫరా సక్రమంగా ఉంటే రైతులు సబ్స్టేషన్ల వద్ద ఎందుకు ధర్నా లు చేస్తున్నారని ప్రశ్నించారు. చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి సాగునీరు, వి ద్యుత్తు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
లో-వోల్టేజ్ సమస్యతో మోటర్లు కాలిపోతున్నాయని, కరెంట్ ఎప్పు డు వస్తుందో తెలియక రాత్రిళ్లు పొలాల వద్ద వేచిచూస్తూ పాముకాట్లకు గురై రైతులు ప్రా ణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తంచేశారు. నెహ్రూ సోషలిజం పేరు చెప్పే ప్రభు త్వం యాదాద్రి ప్లాంట్‌లో కోల్, యాష్ విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు 14 ఎంటీపీఏ బొగ్గు కేటాయింపులు ఉన్నప్పటికీ, లేవని డిప్యూటీ సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి విద్యుత్తును రాజస్థాన్‌కు ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి ని రంతర విద్యుత్తు సరఫరా చేయాలని, 5,420 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలపక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
పంటలకు నీళ్లివ్వడానికి, నిరంతర విద్యు త్తు సరఫరాకు ఎల్ నినో అడ్డొస్తున్నదని ప్రభు త్వం చెప్తున్నదని ఎద్దేవా చేశారు. కానీ మద్యం ఉత్పత్తి, అమ్మకాల విషయంలో మాత్రం అదే ఎల్ నినో ఎందుకు అడ్డురావడం లేదని ప్ర శ్నించారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు, సాగునీటి కొరతపై ప్రభుత్వం చెప్తున్న కారణాలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.