జైళ్ల శాఖలోనూ వేధింపుల పర్వం!
జైళ్ల శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కూడా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రప్పించి, తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని వాపోతున్నారు.
- ఓ సూపరింటెండెంట్ ఆత్మహత్యాయత్నం
- జైళ్ల శాఖ ఉన్నతాధికారులే బాధ్యులని లేఖ
- శాఖ పనితీరు బాగోలేదని సిబ్బంది గగ్గోలు
- హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): జైళ్ల శాఖలో ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కూడా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రప్పించి, తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ జిల్లా జైలుకు చెందిన సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఒకరు ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారని తెలిసింది. ఆయనను కుటుంబసభ్యులు విచారించగా.. తన జేబులో జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించిన లేఖ దొరికిందని విశ్వసనీయ సమాచారం. అందులో ప్రధాన బాధ్యులుగా జైళ్ల శాఖ ఐజీలు, డీజీ పేర్లను కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. తాను చనిపోతే ఆ చావుకు వారే బాధ్యులని లేఖలో రాసుకున్నాడని బాధిత కుటుంబీకులు చెప్పారు. జైళ్ల శాఖ పరిపాలనను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులు.. కిందిస్థాయి సిబ్బందిని పీడించుకు తింటున్నారని అధికారులు వాపోతున్నారు. అకారణంగా బదిలీలు, అటాచ్లు చేస్తూ జైలర్ నుంచి సూపరింటెండెంట్ల స్థాయి అధికారుల వరకు నరకం చూపిస్తున్నారని చెప్తున్నారు.
హోం శాఖ ప్రధాన కార్యదర్శి పట్టించుకోవాలి
తెలంగాణ జైళ్ల శాఖకు నిర్లక్ష్యపు జబ్బు చేసిందని, ‘కరెక్షనల్ సర్వీస్’ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరెక్ట్ చేయాలని సిబ్బంది కోరుతున్నారు. హోం శాఖకు మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి ఆ శాఖను గాలికి వదిలేయడంతో చాలా వరకు జైళ్లలో ఇన్‌చార్జ్‌లతోనే పాలన కొనసాగుతున్నది. రాష్ట్రంలోని సెంట్రల్, జిల్లా, సబ్ జైళ్లలో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని జైళ్ల శాఖ అధికారులు బాహాటంగానే చెప్తున్నారు. జైళ్ల శాఖను సరిదిద్దాలని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వానికి, మీడియా ప్రతినిధులకు రహస్యంగా లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, జైళ్ల శాఖ అధికారులు రహస్యంగా బయటికి వస్తున్న లేఖలపై ఆరా తీస్తున్నారే కానీ.. జైలు సిబ్బందిని, తద్వారా ఖైదీలను ఇబ్బంది పెట్టే అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్య వైఖరి చూస్తూ.. నిఘా వ్యవస్థ పటిష్టంగా లేనిచోట్ల ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకొని పారిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు పరిపాటిగా మారాయి.
దీనికితోడు కొందరు అవినీతి అధికారుల తీరుతో నిజాయితీ గల అధికారులకు కూడా తలవంపులు తప్పట్లేదని అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

