హ్యాండ్వాష్తోనూ ప్రమాదమే
పొద్దున లేవగానే వాడే టూత్‌పేస్ట్, స్నానానికి ఇవాడే సబ్బు, కరోనా కారణంగా నిత్యజీవితంలో భాగమైన హ్యండ్‌వాష్.. ఇవన్నీ ఇప్పుడు మనిషి ఆరోగ్యాన్ని సైలెంట్‌గా ధ్వంసం చేస్తున్నాయని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు.
- ట్రైక్లోసన్‌తో ఆరోగ్య సమస్యలు
- నాడీ వ్యవస్థకు ఇదే ముప్పు
- ఐఐటీ హైదరాబాద్ పరిశోధన
సంగారెడ్డి, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పొద్దున లేవగానే వాడే టూత్‌పేస్ట్, స్నానానికి ఇవాడే సబ్బు, కరోనా కారణంగా నిత్యజీవితంలో భాగమైన హ్యండ్‌వాష్.. ఇవన్నీ ఇప్పుడు మనిషి ఆరోగ్యాన్ని సైలెంట్‌గా ధ్వంసం చేస్తున్నాయని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు. వాటిలో వాడే ట్రైక్లోసన్ అనే రసాయనం మనిషి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనామిక భార్గవ బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ట్రైక్లోసన్‌ను 1960లో అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి దీనిని అనేక ఉత్పత్తుల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ఎక్కువగా టూత్‌పేస్టులు, సబ్బులు, హ్యాండ్‌వాష్‌ల తయారీలో వాడుతున్నారు. ఆరోగ్యంపై ట్రైక్లోసన్ ప్రభావాన్ని తెలుసుకొనేందుకు జీబ్రాఫిష్ అనే ఒక రకమైన చేపలు, ఎత్తుగా ఉండే జంతువులపై పరిశోధన నిర్వహించారు. ఆ తర్వాత మానవులపై అధ్యయనం చేయగా మెదడు కణాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తేలింది. ఇది న్యూరోట్రాన్స్మిషన్లో పాల్గొనే జన్యువులు, ఎంజైమ్‌లను ప్రభావితం చేయడమే కాకుండా న్యూరాన్లను కూడా దెబ్బతీస్తుందని గుర్తించారు.
న్యూరాన్ జంక్షన్ల వద్ద న్యూరో ట్రాన్స్మిటర్కు నియంత్రణలా పనిచేసే ఎసిటైల్ కోలినెస్టరేస్ అనే ఎంజైమ్‌ను బలహీనం చేస్తున్నట్టు తేలింది. ట్రైక్లోసన్ ప్రభావం ఎలా తగ్గించవచ్చన్న దానిపైనా అనామిక భార్గవ బృందం పరిశోధనలు చేసింది. మెలటోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను వాడటంతో ట్రైక్లోసన్ ప్రభావాన్ని నివారించవచ్చని గుర్తించారు. ట్రైక్లోసన్‌ను ప్రభావాన్ని నివారించే యాంటి ఆక్సిడెంట్లు ఆకుకూరలు, పండ్లు, నట్స్‌లో ఉంటాయని అనామిక భార్గవ తెలిపారు. ట్రైక్లోసన్ ఆధారిత ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐఐటీ హైదరాబాద్ నిరంతరం పరిశోధనలు జరుపుతున్నదని తెలిపారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ (ఎఫ్‌డీఏ) ఇప్పటికే ట్రైక్లోసన్ వాడకంపై పాక్షిక నిషేధం విధించించినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

