అంబేద్కర్‌పై నీచ వ్యాఖ్యలు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో నీచ వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను శుక్రవారం సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
- హమారా ప్రసాద్ అరెస్టు
- బీజేపీ, ఆరెస్సెస్‌తో సంబంధాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో నీచ వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను శుక్రవారం సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజుల్లో తాను బతికి ఉన్నైట్టెతే గాంధీజీని గాడ్సే హత్య చేసినట్టుగానే.. తాను కూడా అంబేద్కర్‌ను చంపేవాడినంటూ హమారా ప్రసాద్ ఫేస్బుక్, యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేశాడు. దీనిపై భీమ్ఆర్మీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరబాద్‌లోని అల్వాల్‌లో నివాసం ఉండే హమారా ప్రసాద్ అలియాస్ నాగులాపు వరప్రసాద్ రాష్ట్రీయ దళిత్సేన పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు.
అతనికి బీజేపీ, ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రసాద్ కొంతకాలంగా అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో రాజ్యాంగ దినోత్సవంపై కూడా వివాదాస్పద పోస్టులు పెట్టాడు. తాజాగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తూ అంబేద్కర్ పుస్తకాలు రాశాడనీ, ఆ రోజుల్లో తాను బతికి ఉన్నైైట్టెతే గాంధీని గాడ్సే చంపినట్టుగానే తాను కూడా అంబేద్కర్‌ను చంపేవాడినంటూ ఫేస్బుక్, యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేశాడు. నిందితుడు హమారా ప్రసాద్‌ను శనివారం కోర్టులో హాజరుపరుచనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

