వారం రోజుల్లో గ్రూప్ 4కు అనుమతి!
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తున్నది.
- 5 నెలల్లో 65.5% ఉద్యోగాలు
- 52,460 పోస్టులకు అనుమతి
- పదిరోజుల్లోనే నోటిఫికేషన్లకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తున్నది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించగా, 5 నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-4కు సైతం వారంరోజుల్లో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఖాళీల వివరాలు, భర్తీ ప్రక్రియ తదితర అంశాల గురించి ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి.
ఇప్పటికే 52,460 పోస్టులకు అనుమతి
సీఎం కేసీఆర్ ప్రకటించిన 5 నెలల్లోనే 52,460 ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇంకా 27,579 ఉద్యోగాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే 19,359 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేశారు. మరో 33,101 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు రానున్నట్టు తెలిసింది. వీటికి సంబంధించి ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని ఖాళీల వివరాలను ఆయా నియామక సంస్థలు తెప్పించుకున్నాయి. ఆ వివరాలన్నింటినీ పునఃపరిశీలించి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన 27,579 పోస్టుల్లో సుమారు 90 శాతం ఉద్యోగాలకు సెప్టెంబర్‌లోనే అనుమతు ఇవ్వనున్నట్టు తెలిసింది. మిగిలిన కొన్నింటికి అక్టోబర్ మొదటి, రెండోవారంలో ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.
ప్రక్రియ మరింత వేగవంతం
80,039 ఉద్యోగాలను భర్తీ చేయాలనే సంకల్పంతో సర్కారు శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు, ఆయా శాఖలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖల్లో నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల ప్రక్రియలో మరింత వేగం పెంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని కమిషన్ ప్రకటించింది. మెయిన్స్‌ను సైతం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని తెలిపింది. ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిన వారం, పదిరోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. దీనికి సంబంధించి అనుమతులు, సవరణలు, నోటిఫికేషన్ల జారీ సంబంధిత ప్రక్రియపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.
పకడ్బందీ ప్రణాళిక
ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళ్తున్నది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇస్తున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం 95 శాతం స్థానిక కోటా, రిజర్వేషన్లు తదితరాలు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరోసారి సరిచూసుకొని, నియామక బోర్డులు రీ చెక్ చేసిన తర్వాత నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

