హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని, ముందస్తు గుర్తింపుతో ప్రాణాలను రక్షించుకోవచ్చని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెల్లడించారు. రొమ్ముక్యాన్సర్ నివారణలో భాగంగా ఏటా అక్టోబర్ నెలను అవగాహన మాసంగా నిర్వహిస్తారు.
అందులో భాగంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ 18వ ‘పెయింట్ ది సిటీ పింక్ ’ ప్రచారంలో లోక్‌భవన్‌ను బుధవారం రాత్రి గులాబీకాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురసార గ్రహీత డాక్టర్ రఘురామ్‌తో కలిసి గవర్నర్ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.