Akira Ransomeware | ఇంటర్నెట్ యూజర్లను భయపెడుతున్న .అకిరా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు!
ఇంటర్నెట్ వినియోగదారులను ‘.అకిరా’ కలవరపెడుతున్నది. ఈ రాన్సమ్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు విండోస్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా దొంగిలించిన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
Akira Ransomeware | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ వినియోగదారులను ‘.అకిరా’ కలవరపెడుతున్నది. ఈ రాన్సమ్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు విండోస్ లైనెక్స్ ఆధారిత సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా దొంగిలించిన వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబర్ స్పేస్‌లో ‘.అకిరా’ ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) చెప్తున్నప్పటికీ తెలంగాణలో ఈ రాన్సమ్వేర్ ప్రభావం లేదని సైబర్‌క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు. ఎనీ డెస్క్, విన్రార్, పీసీహంటర్ లాంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ రాన్సమ్వేర్ను సమర్థంగా అడ్డుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఆ జాగ్రత్తలు ఏమిటంటే..
☞ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తోపాటు సాఫ్ట్వేర్లు, వెబ్బ్రౌజర్లు, ఇతర అప్లికేషన్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి.
☞ యాంటీ వైరస్‌లతో సిస్టమ్స్‌ను తరచుగా క్లీన్ చేసుకోవాలి. అందుకోసం మంచి కంపెనీల యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఉపయోగించడం ఉత్తమం.
☞ ఈ-మెయిళ్లతోపాటు వాట్సప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌కు మెసేజ్‌ల ద్వారా వచ్చే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియనివారి నుంచి వచ్చే మెయిల్ అటాచ్మెంట్లను ఓపెన్ చేయకూడదు.
☞ బ్రౌజింగ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తెలియని వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు అనుమానాస్పద ప్రకటనలపై క్లిక్ చేయకూడదు.
☞ బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం మంచిది. మీ ఈ-మెయిల్, సోషల్ మీడి యా అకౌంట్లకు రెండంచెల (టు స్టెప్) వెరిఫికేషన్, అథంటికేషన్ ఉండేలా చూసుకోవాలి. లేదా ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
☞ డాటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకుని పెన్‌డ్రైవ్ లేదా సురక్షితమైన క్లౌడ్ సర్వీస్‌లో నిల్వ చేసుకోవడం ఉత్తమం.
☞ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఆన్లైన్ నేరాలతోపాటు సైబర్ సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

