హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సీఎస్ఆర్ నిధులు వినియోగించి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు రూపొందించే కార్యక్రమంలో టీ వర్క్స్‌తో జీఈ అప్లియన్సెస్ జట్టుకట్టింది. విక్రేతలు, సరఫరాదారుల మద్దతుతో టీ వర్క్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అభివృద్ధి చేస్తున్నది. ఈ చొరవలో భాగస్వామ్యమైన జీఈ అప్లియెన్సెస్ ఉద్యోగులు 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సమీకరించారు. ఈ సందర్భంగా టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి మాట్లాడుతూ.. జీఈతో తమ భాగస్వామ్యం ఈ ఒక్క ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాదని అన్నారు. తమకు మద్దతుగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.