Funtastic | నాకు రాకపోయినా సరే.. పక్కోడికి రావొద్దు.. కాంగ్రెస్ నేతల తీరుపై ఫన్టాస్టిక్ సెటైర్
Funtastic | ‘గెలవడం కష్టం తమ్మీ... 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని బాగుపడ్డానని జనం ఓటు వేయలేదు. ఒకడు బాగుపడితే జనం తట్టుకోలేరు. అందుకే ఈసారి గెలుపు మీద కాదు, ఓడించడం మీద దృష్టి పెట్టాను. 118 మందిని కాదు. వీరిలో చాలా మంది తమంతట తామే ఓడిపోతారు. కానీ, సీఎం రేసులో ఉన్న ఒక్కొక్కడిని ఓడించి నా సత్తా చూపిస్తా.
Funtastic | ‘కోమటిరెడ్డన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే ఈ ఎన్నికల్లో ఘన విజయం గురించే… అంతే కదా అన్నా?’
‘కాదు తమ్ముడు… ఒక్కొక్కణ్ని ఎలా ఓడించాలి అని ఆలోచిస్తున్నా?’
‘ఎవరినీ… మీ ప్రత్యర్థి పార్టీ వాళ్లనా అన్నా?’
‘కాదు మన సొంత పార్టీలో ప్రత్యర్థులను తమ్మీ …’
‘అదేంటన్న ఇక్కడ నువ్వు మాత్రమే నామినేషన్ వేశావు. రెబల్ ఎవరూ లేరు కదా?’
‘హా .. హా .. మీకు తెలుసు కదా? జనం గెలిపించినా, ఓడించినా మునుగోడు గురించి నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. జనం కూడా నా గురించి పెద్దగా ఆలోచించరు. నేను ఓడిస్తాను అన్నది సీఎం పోస్ట్ కోసం నాకు పోటీ వస్తున్న వాళ్లని’
‘అంటే 119 మందిని ఓడిస్తావా అన్న ? ప్రతి క్యాండిడేట్ సీఎం రేస్‌లో ఉన్నాడు కదా?
‘హా.. హా .. భలే జోక్ వేస్తావు తమ్ముడు. అలా ఐనా 118 అనాలి. మనం ఒక సీటు సీపీఐకి వదిలేశాం కదా?’
‘ఏమనుకోకన్నా… నువ్వు ఒక్కడివే కోట్లు ఖర్చు చేసినా గెలవలేదు. 118 మందిని ఓడిస్తావా అన్న?’
‘గెలవడం కష్టం తమ్మీ… 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకుని బాగుపడ్డానని జనం ఓటు వేయలేదు. ఒకడు బాగుపడితే జనం తట్టుకోలేరు. అందుకే ఈసారి గెలుపు మీద కాదు, ఓడించడం మీద దృష్టి పెట్టాను. 118 మందిని కాదు. వీరిలో చాలా మంది తమంతట తామే ఓడిపోతారు. కానీ, సీఎం రేసులో ఉన్న ఒక్కొక్కడిని ఓడించి నా సత్తా చూపిస్తా. రేటెంత రెడ్డితో పాటు, సీతక్క, మధు అన్న వరకు అందరూ మేమే సీఎం అంటున్నారు. ఆ అందరినీ ఓడించే మాస్టర్ ప్లాన్ నా దగ్గర ఉంది. మునుగోడులో ఓడిపోయాను అని చిన్న చూపు చూస్తున్నారేమో… గెలిచే ప్లాన్ లేదు కానీ, ఓడించే ప్లాన్ ఉంది.’
‘సరే సీఎం క్యాండిడేట్స్ అందరూ ఏం చేస్తున్నారో రహస్యంగా తెలుసుకొని వెంటనే నాకో రిపోర్ట్ ఇవ్వు.
‘జానారెడ్డి గురించి కూడానా అన్నా?’
‘ఆయనేం చేస్తున్నాడో… ఏం మాట్లాడుతున్నాడో… ఆయనకే తెలియదు. ఇక మీరేం తెలుసుకుంటారు. రహస్యంగా కాదు బహిరంగంగా ఆయనే ప్లాన్ చెప్పినా అర్థం కాదు. రేస్‌లో ఆయన కూడా ఉన్నాడు కానీ, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా? ఆయన్ని వదిలేసి మిగిలిన సీఎం క్యాండిడేట్స్ వ్యూహం ఏమిటో వెంటనే రిపోర్ట్ ఇవ్వండి…’
*****
‘అన్నా గెలుపు మనదే.’
‘మనం గెలుస్తున్నామా?’
‘కాదు .. సీఎం క్యాండిడేట్స్ అందరినీ ఓడించడమే మీ లక్ష్యం కదా? మిగిలిన వాళ్లంతా ఇదే పనిలో ఉన్నారు. వ్యూహాలు పన్నుతున్నారు.’
‘మన ప్లాన్ లీకైందా?’
‘కాదు. మన హస్తం డీఎన్ఏ మొదటి నుంచి అదే కదా? అయినా భయపడకండి. మీ అందరి కోరికా తీరుతుంది?’
‘అంటే ఆరు నెలలకు ఒకరం సీఎం అవుతామా?’
‘కాదు. మీ అందరి కోరికా తీర్చి జనం మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు.’
– మురళి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

