Telangana Assembly Elections | అది బలగం నర్సయ్య టైలర్ షాప్
ఓ లీడర్ ఆగమాగం అచ్చి
అరేయ్ నర్సిగా అర్జెంటుగా
పైజామా, కుర్తా, గాంధీటోపీ కుట్టురా..
జనవరిలో సీఎం అయ్యేది నేనే అన్నడు రుబాబ్గా
అటెన్కనే నీ రేటెంత అన్నడు..
అప్పటిదాకా తలకిందికి వంచుకొని
మిషిన్ కుడ్తున్న నర్సిగానికి రేటెంత అనంగనే
వచ్చిందెవరో అర్థమైపోయింది..
సరేసరేగానీ ముందు 2,016
రూపాయలు ఆడ టేబుల్ మీద పెట్టి
కొలతలిచ్చి పో అన్నడు నర్సిగాడు
అటెన్క ఫోన్లచ్చిన మెసేజ్ చూసుకుంటా
ఇదంతా దుబారా అనుకుంట
ఓ పొడుగుబారి గడ్డపాయిన అచ్చిండు
దుబారా అనంగనే నర్సిగానికి ఎక్కన్నో మండింది..
వీడు అకౌంట్ల పడ్డ రైతుబంధు వాడుకుంటా
దాన్నే దుబారా అంటడు
బేవార్స్గాడు అని
లోలోపలనే తిట్టుకున్నడు..
ఆ గడ్డమున్న పొడగాయినగూడా
అరేయ్ నర్సిగా జనవరిలో నేనే
సీఎంగా పమానం చెయ్యాలె
పైజామా, కుర్తా, గాంధీటోపీ
కుట్టురా అన్నడు..
నర్సిగాడు సరేగానీ నీకు పడ్డ రైతుబంధులకెళ్లి
ఓ 2,016 ఆడ టేబుల్ మీద పెట్టి కొలతలిచ్చిపో అన్నడు..
ఇదంతా చూస్తున్న నర్సిగాని పనోడు
అవ్ అన్న నువ్వు ఎవ్వలకైనా
బట్టలు కుట్టినంకనే పైసలు
తీసుకుంటవ్ గదా..
మరి గీళ్ల దగ్గరేంది
ముందే వసూలు జేసినవ్ అని అడిగిండు..
దానికి నర్సిగాడు.. అరేయ్ వాళ్లు కాంగ్రెసోళ్లురా బయ్
వాళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు..
ఓడిపోయినంక వాళ్లు ఇటు మోకాన అత్తరార..
ఆ పైజామా, కుర్తా
మనమేం జేసుకుంటంరా
పొలాల కాడ దిష్టిబొమ్మలెక్క పెట్టుకునుడు తప్ప
ఎందుకు పనికత్తయ్ చెప్పు..
అందుకే వాళ్ల దగ్గర
ముందే పైసల్ వసూల్జేసిన
అని నవ్వుకుంట చెప్పి పనిలవడ్డడు..
-రాజు అతికం