BJP Manifesto | బీజేపీ మ్యానిఫెస్టోపై ఫన్టాస్టిక్ సెటైర్
BJP Manifesto | ‘ఎలా ఉందంటున్నారు? మన మ్యానిఫెస్టో... దుమ్ము దులిపేస్తుంది కదా?’ ‘ఔను సార్... ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ చూసినా మన మ్యానిఫెస్టో పుస్తకాలే కనిపిస్తున్నాయ్. ఎవరి చేతిలో చూసినా ఆ పుస్తకంలోని పేజీలే ...’ ‘ట్యాంక్ బండ్‌పై మీటింగ్ ఏమీ లేదే... అలా ఎలా?’ ‘మీటింగ్ కాదు. ట్యాంక్ బండ్ మీద చుడువ చాలా ఫేమస్
BJP Manifesto | ‘ఎలా ఉందంటున్నారు? మన మ్యానిఫెస్టో… దుమ్ము దులిపేస్తుంది కదా?’
‘ఔను సార్… ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ చూసినా మన మ్యానిఫెస్టో పుస్తకాలే కనిపిస్తున్నాయ్. ఎవరి చేతిలో చూసినా ఆ పుస్తకంలోని పేజీలే …’
‘ట్యాంక్ బండ్‌పై మీటింగ్ ఏమీ లేదే… అలా ఎలా?’
‘మీటింగ్ కాదు. ట్యాంక్ బండ్ మీద చుడువ చాలా ఫేమస్. చుడువ అమ్మే వాళ్లకి పొట్లం కట్టేందుకు మన మ్యానిఫెస్టో పుస్తకం బాగా ఉపయోగపడుతున్నది. ఐనా అదే సంతోషం లెండి’
‘అదేంటోయ్ మన హామీలు బాగా లేవా?’
‘బాగా లేక పోవడం కాదు, మన మీద నమ్మకం లేదు’
‘ఎందుకలా?’
‘యూపీఏ హయాంలో ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌కు తరలించాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అటకెక్కించాం. అన్ని రాష్ర్టాలకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపించాం. నవోదయ పాఠశాల కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇవ్వడంలో తెలంగాణ అనగానే మనకు చేతులు రావడం లేదు. ఢిల్లీలో పదేండ్లు అధికారంలో ఉండి ఏమీ ఇవ్వని వాళ్ళం, ఇప్పుడు ఏదో ఇస్తాం అని మ్యానిఫెస్టోలో పెడితే చుడువ కట్టే పొట్లానికి తప్ప దేనికీ పనికి రాదు అంటున్నారు’
‘దానిదేముందోయ్… ఈ మ్యానిఫెస్టో నమ్మకపోతే కమలం రెండో మ్యానిఫెస్టో విడుదల చేద్దాం.
ఐడియా బాగుంది. చిన్నప్పుడు వంద రోజులు సినిమా నడిచే కాలంలో సినిమా తన్నేస్తుంది అనుకుంటే, రెండు వారాలు గడిచాక ఇంకో పాటను సినిమాలో చేర్చేవారు. అక్కినేని సెక్రెటరీ సినిమాలో ఇలా పాట చేర్చినట్టు గుర్తు’
‘సరే… జనం నమ్మాలి అంటే కొత్త మ్యానిఫెస్టోలో ఏముండాలో చెప్పు?’
‘ఇప్పటి వరకు మనం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి, ఏమిస్తామన్నా నమ్మరు. నమ్మాలి అంటే ఇస్తాం అని కాదు. లాగేసుకుంటాం అని చెప్పాలి.
ఏం లాగేసుకుంటాం?’
‘చార్మినార్‌ను గుజరాత్‌కు, హైటెక్ సిటీని ఉత్తర్ ప్రదేశ్‌కు, యాదాద్రిని మహారాష్ట్రకు తరలిస్తాం అని చెప్పాలి’
‘కమలం వికసించడానికి సలహాలు ఇమ్మంటే, నువ్వేంటోయ్ కర్ణుడికి సారథ్యం వహిస్తూనే సూటి పోటి మాటలు అన్న శల్యుడిలా… అలా చెబుతావేం. ఉపాయం చెప్పు’
‘ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు… ’
‘ఇది పాత ఐడియానే. ఈ మాట చెప్పే కదా… మోడీ ఓట్లు కొల్లగొట్టింది.’
‘నేను పూర్తిగా చెప్పక ముందే మధ్యలోనే అడ్డు తగిలావు. ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పినా ఎవరూ నమ్మరు నాకా సంగతి తెలుసు’
‘మరి?’
‘పదిహేను లక్షలు వేస్తామని చెప్పడం కాదు. ఎన్నికలకు ముందే ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు వేయాలి. అప్పుడు కానీ మన మాట నమ్మరు. పదేండ్లలో తెలంగాణకు ఏమిచ్చారు అని చూస్తారు’
‘అప్పుడు నమ్ముతారు అంటావా?’
‘గ్యారంటీ లేదు. అవకాశం ఉంది. ఏం చేస్తాం… అదీ మన క్రెడిబులిటీ..!’
– మురళి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

