హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): విదేశీ భాషలు నేర్చుకొంటే లక్షల్లో వేతనాలతో కార్పొరేట్ కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఇలాంటి అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు వీలుగా డిగ్రీలో రెండో భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఫ్రెంచ్తోపాటు జపనీస్, జర్మన్, స్పానిష్, చైనీస్, అరబిక్ భాషలను దశలవారీగా తేవాలని భావిస్తున్నది.
తొలుత ఫ్రెంచ్ను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్లోని అలయన్స్ ఫ్రాంచైజ్ సంస్థతో ఉన్నత విద్యామండలి త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నది. దీనిపై సోమవారం ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు చర్చించారు. త్వరలో జపనీస్, జర్మన్ భాషలు బోధించే సంస్థలతోనూ ఉన్నత విద్యామండలి అధికారులు ఎంవోయూకు కుదుర్చుకోనున్నారు. విధివిధానాల ఖరారుకు ఓయూను నోడల్ ఏజెన్సీగా నియమించారు.