హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డెంటల్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. శిక్షణాకాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏండ్ల వయసు ఉండి, ఎస్సెస్సీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. వివరాలకు 98485 81100, 90599 02355, 63091 60808 నంబర్లను సంప్రదించాలని సూచించారు.