Covid Positive | తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ (Covid Positive) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కొత్తగా మంగళవారం 402 మందికి వైద్యారోగ్యశాఖ సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్రంలో తొమ్మిది కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన న్యూస్ బులెటిన్ లో వెల్లడించింది. సుమారు ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది.