కేసీఆర్కు పోచారం వెన్నుపోటు
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ప్రశ్నించారు.
- ఏం తక్కువైందని పార్టీ మారిండు
- పోచారంపై మాజీ ఎమ్మెల్యేల ఫైర్
కామారెడ్డి, జూన్ 24: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ప్రశ్నించారు. ఎంతో గౌరవమిచ్చిన కేసీఆర్కు వెన్నుపోటు పొడవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కామారెడ్డిలోని గంప నివాసంలో వారు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘పోచారంను సీనియర్ నాయకుడిగా గుర్తించి కేసీఆర్ 2014లో వ్యవసాయశాఖ మంత్రిగా, 2018లో తెలంగాణ శాసన సభాపతిగా అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించారని, బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్, బాన్సువాడ నియోజకవకర్గ ప్రజలను మోసం చేసిన పోచారంను, ఆయన కుటుంబాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని తెలిపారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

