మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి హఠాన్మరణం
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు.
- పరిగిలో గుండెపోటుతో మృతి
- నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
- ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
పరిగి, సెప్టెంబర్ 22 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ప్రజాభిమానం పొందిన నేత: సీఎం కేసీఆర్
మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

