ఉచిత ప్రయాణం లేదు.. దిగిపోండి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలు ఇబ్బందులు ఎదురొంటూనే ఉన్నారు.
- రాజన్న దర్శనానికి వచ్చిన కుటుంబానికి కండక్టర్ ఆదేశం
- ఆర్టీసీ బస్సులోంచి బలవంతంగా కిందికి
- సోషల్ మీడియాలో వైరల్.. వేములవాడ డీఎం విచారణ
వేములవాడ, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలు ఇబ్బందులు ఎదురొంటూనే ఉన్నారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం సోమవారం సాయంత్రం జగిత్యాల బస్‌స్టాప్‌లో ఆర్టీసీ బస్సు ఎకేందుకు ప్రయత్నించింది.
ఈ సందర్భంగా బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్.. ‘ఉచిత.. గిచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు’ అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని అకడున్న ప్రయాణికులు వీడియో తీసి.. సోషల్ మీడియాల్ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రయాణం మాట దేవుడెరుగు కానీ.. బలవంతంగా బస్సు నుంచి కిందికి దింపడంతో సదరు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీకృష్ణ సదరు కండక్టర్‌ను పిలిచి విచారించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

