ఎస్సై ప్రిలిమ్స్‌కు ముమ్మర ఏర్పాట్లు
- ఈ నెల 7న ప్రాథమిక పరీక్ష
- మొత్తం 503 సెంటర్లలో నిర్వహణ
- హాజరుకానున్న 2,47,217 మంది
- ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీల సమీక్షలు
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైదరాబాద్‌తోపాటు 35 పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 554 పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. అంటే ఒక్కొక్క పోస్టుకు 446 మంది చొప్పున పోటీ పడుతున్నట్టు లెక్క. జిల్లాల, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై స్థానిక ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతర అంశాలను పరిశీలించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. నోడల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఇన్విజిలేటర్లతో పోలీస్ ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్‌హెచ్‌వోలకు సూచిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలని సూచిస్తున్నారు.
హాల్‌టికెట్ల డౌన్లోడ్ మొదలు
ఎస్సై ప్రిలిమ్స్ హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) అధికారిక వెబ్సైట్ www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 30 నుంచి ఆగస్టు 5 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోనే అవకాశం కల్పించారు. అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపవచ్చు. 9393711110 లేదా 9391005006 ఫోన్ నంబర్లలోనూ సంప్రదించవచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- SI prelims exam
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

