Urea | యూరియా కోసం రైతుల తిప్పలు.. క్యూలైన్లో చెప్పుల, చెట్ల కొమ్మలు, రాళ్లు, సద్ది మూటలు.. వీడియో
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. తిండి తిప్పలు మాని, ఎండ వానాలను లెక్కచేయకుండా యూరియా కోసం తిప్పలు పడుతున్నారు.
యాదాద్రి/సూర్యాపేట: యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. తిండి తిప్పలు మాని, ఎండ వానాలను లెక్కచేయకుండా యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురులో సహకారం సంగం వద్దకు గురువారం తెల్లవారుజామునే రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. భారీగా లైను ఉండటంతో.. వారిని చూసిన అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తామని చెప్పారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు రెండు బస్తాలు కావాలంటూ వాదించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరస్థితి నెలకొన్నది. అయితే ఉన్నకాడికి ఇస్తామని, ఎంత మందికి వస్తాయో తెలవదని అధికారులు చెప్పేశారు.

మరోవైపు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూర్‌లో బుధవారం రాత్రే సహకారం సంఘం వద్దకు రైతులు చేరుకున్నారు. గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. చెప్పులు, కర్రలు, టిఫిన్ బాక్సులు, రాళ్లు, చెట్ల కొమ్మలు లైనులో పెట్టారు.
అడ్డగూడురులో..
ఏపూర్‌లో..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vatsala Rajagopal | ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత!
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

